: నూతన సంవత్సర వేడుకలపై సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు
హైదరాబాదులో నూతన సంవత్సర వేడుకలపై సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు వేడుకలు నిర్వహించే నిర్వాహకులు... ఆహ్వానితులను మాత్రమే తమ ప్రాంగణంలోకి అనుమతించాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. వేడుకలకు దంపతులను మాత్రమే అనుమతించాలని, ఒక్కరు వస్తే మాత్రం అనుమతించొద్దని చెప్పారు. అంతేగాక డిసెంబర్ 31 రాత్రి మద్యం తాగి కారు నడిపితే చర్యలు తప్పవని తెలిపారు.