: జగన్ చీకటి రాజకీయాలు మానుకోవాలి: ధూళిపాళ్ల
తెలుగుదేశం పార్టీకి నీతి సూత్రాలు చెప్పాల్సిన అవసరం జగన్ కు లేదని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ముందు జగన్ తన చీకటి రాజకీయాలకు ముగింపు పలకాలని సూచించారు. సమైక్యవాదం పేరుతో జగన్ విభజన రాజకీయాలు చేస్తున్నారని... రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ కు తనవంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు ధూళిపాళ్ల హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.