: కారు వెనక సీట్లో మూడు లక్షల డాలర్లు దొరికాయ్..
అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో ట్యాక్సీ వెనుక సీట్లో డాలర్ల కట్టలు దొరకడం అక్కడ సంచలనం సృష్టించింది. ట్యాక్సీ డ్రైవర్ గెరాల్డో ప్రయాణికుడిని గమ్యస్థానంలో దించేసి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ తరువాత ట్యాక్సీ వెనుక సీట్లో బ్యాగు ఉన్నట్లు గమనించాడు. తీరా చూస్తే.. మూడు లక్షల డాలర్లు కన్పించాయి. వెంటనే ఆ డ్రైవర్ ట్యాక్సీ యజమానికి సమాచారం అందించాడు. యజమానితో కలిసి వెళ్లి గెరాల్డో ఆ సొమ్మును పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఈ విషయమై విచారణ జరిపి ఆ డాలర్లను యజమానికి అందించాడు. డ్రైవర్ గెరాల్డో నిజాయతీని అభినందిస్తూ ట్యాక్సీ యజమాని.. అతనికి వెయ్యి డాలర్లను బహుమతిగా ఇచ్చాడు.