: న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపను: జకియా జఫ్రి
2002 అల్లర్ల కేసులో మోడీకి అహ్మదాబాద్ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై పిటిషన్ దారు జకియా జఫ్రి స్పందించారు. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపనని తెలిపారు. అహ్మదాబాద్ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళతానని... పై కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు జాఫ్రి చెప్పారు. గుజరాత్ అల్లర్లలో జకియా భర్త, కాంగ్రెస్ ఎంపీ అయిన ఇషాన్ జఫ్రీ హత్యకు గురయ్యారు.