: ఇప్పుడు ఆ పార్టీ లెక్కలు చూద్దాం


ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను చవి చూసిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అంతర్మథనంలో పడ్డారు. హస్తిన పీఠం‘చే’జారిపోవడంతో ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న వారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇచ్చినా.. ఆ పార్టీకి మంత్రివర్గంలో చోటివ్వమంటూ ఆమ్ ఆద్మీ పార్టీ తేల్చి చెప్పింది. దాంతో ఇన్నాళ్లూ అధికారాన్ని అంటిపెట్టుకొన్న కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు కావాల్సినంత ఖాళీ సమయం చిక్కింది. ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఆమ్ ఆద్మీ పార్టీని ఆసాంతం పరిశీలిస్తున్నారు. తాజాగా ఏఏపీ ఎన్నికలకు ముందు సేకరించిన విదేశీ నిధుల లెక్కలను తనిఖీ చేయాలంటూ అధికారులను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. శూల శోధన అంటే ఇదేనేమో..

  • Loading...

More Telugu News