: వైఎస్సార్సీపీలో చేరిన ఆనం అనుచరుడు
నెల్లూరుకు చెందిన కాంగ్రెస్ నేత, రాష్ట్ర వంటనూనె వర్తకుల సంఘం అధ్యక్షుడు పెంచల్ రెడ్డి ఈరోజు హైదరాబాదులో జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెంచల్ రెడ్డి ఇంతకుముందు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అనుచరుడుగా ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయనను అనుసరించారు.