: ఘట్ కేసర్ లో ఆర్టీసీ బస్సు బోల్తా
రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈరోజు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఘట్ కేసర్ - కేపాల్ రోడ్డుపై వెళ్తుండగా అదుపుతప్పిన బస్సు పల్టీ కొట్టడంతో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.