: అరుణుడు నివాసానికి అనుకూలమే: నాసా


సూక్ష్మ జీవుల నివాసానికి అరుణ గ్రహం (మార్స్) ఒకప్పుడు తోడ్పడిందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. మార్స్ పై క్యూరియాసిటీ సేకరించిన రాతి శాంపిళ్ల ఆధారంగా ఈ విషయం తెలుస్తోందని ప్రకటించింది. "మార్స్ నివాసానికి అనువైనదా? అనేది ప్రాథమికమైన ప్రశ్న. ఇది నివాసానికి అనువైనదే అని ఇప్పడు వెల్లడైంది" అని నాసా శాస్త్రవేత్త మైకేల్ మేయర్ చెప్పారు.

సల్ఫర్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్పరస్, కార్బన్ ప్రాణులు జీవించడానికి అవసరమని.. క్యూరియాసిటీ అరుణుడిపై డ్రిల్లింగ్ చేసి సేకరించిన మట్టి నమూనాలు ఈ వాయువుల జాడను వెల్లడిస్తున్నాయని మైకేల్ తెలిపారు. 

  • Loading...

More Telugu News