: రాహుల్ కు స్వలింగ సంపర్కుల సంక్షేమమే కావాలి: సమాజ్ వాదీ పార్టీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ బాధితులను ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో రాహుల్ అల్లర్ల బాధితులతో మాట్లాడుతూ, విద్రోహ శక్తుల చేతిలో పావులు కాకూడదని హితవు చెప్పారే కానీ, వారికి ఎలాంటి హామీలు ఇవ్వలేకపోయారని సమాజ్ వాదీ పార్టీ విమర్శించింది. అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయిన బాధితుల గోడు రాహుల్ కు పట్టలేదని... ఆయన దృష్టంతా స్వలింగ సంపర్కుల సంక్షేమంపైనే ఉందని ఎస్పీ నేత ఆజం ఖాన్ మండిపడ్డారు. శిబిరాల్లో గడుపుతున్న నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని దుయ్యబట్టారు. ముజఫర్ నగర్ అల్లర్ల బాధితులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి కానీ, వారికి పునరావాసం కల్పించేందుకు కానీ ఎస్పీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని... రాహుల్ తన పర్యటన సందర్భంగా సెటైర్లు విసిరారు. దీంతో, ఎస్పీ నేత తీవ్రంగా ప్రతిస్పందించారు.