: దిగ్విజయ్ ఏమైనా పోస్టుమేనా?: జేసీ


తనకు షోకాజ్ నోటీసులు అందాయన్న దిగ్విజయ్ వ్యాఖ్యలపై జేసీ దివాకర్ రెడ్డి ఫైరయ్యారు. నోటీసులు అందాయని చెప్పడానికి దిగ్విజయ్ ఏమైనా పోస్టుమేనా? అంటూ ప్రశ్నించారు. తనకు అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదని... నోటీసులు అందితే వివరణ ఇస్తానని తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మతి భ్రమించినట్టుందని... అందుకే 40 ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన తనకు నోటీసులు ఇవ్వాలనుకుంటోందని మండిపడ్డారు. తాడిపత్రి నియోజకవర్గానికి నీళ్లు కావాలని అడగడానికే తాను ఈ రోజు సీఎంను కలిశానని చెప్పారు.

  • Loading...

More Telugu News