: హజారేకు అస్వస్థత.. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యే చాన్స్?


ఈ నెల 28న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, సామాజిక కార్యకర్త అన్నా హజారేకు ఆహ్వానం పంపినట్లు నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. అయితే, ఈ కార్యక్రమానికి అన్నా గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై అన్నాను అడగ్గా.. తాను అనారోగ్యంగా ఉన్నానని, ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజారే రారనే అనుకోవచ్చు.

  • Loading...

More Telugu News