: మే 17న ఎంసెట్.. ఫిబ్రవరి 10న నోటిఫికేషన్


2014లో రాష్ట్రంలో నిర్వహించనున్న వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో షెడ్యూల్ విడుదల చేశారు. మే 17న ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. దానికి ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, జూన్ 2న ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఇక మే 15న పీఈసెట్, మే 10న ఈసెట్, మే 21న పాలిసెట్, మే 25న ఐసెట్, జూన్ 2న ఎడ్ సెట్, జూన్ 8న లాసెట్, జూన్ 25 నుంచి 29 వరకు పీజీఈసెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

  • Loading...

More Telugu News