: నేడు మావో 120వ జయంతి.. నివాళులర్పించిన చైనా


ఆధునిక చైనా రూపకర్త, చైనా జాతిపిత మావో జెడాంగ్ 120వ జయంతి ఉత్సవాలను చైనాలో ఘనంగా జరుపుకున్నారు. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ తో పాటు చైనా కమ్యూనిస్ట్ పార్టీ కోర్ కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులు తియానన్మేర్ స్క్వేర్ దగ్గరున్న మావో సమాధి వద్ద ఆయనకు నివాళులర్పించారు. మావో జయంతి సందర్భంగా చైనా దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు.

ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తులలో మావో ఒకరుగా కీర్తిగాంచారు. చైనా సైనిక, పారిశ్రామిక, వ్యవసాయ, మేథోపరమైన మార్పులకు మావో నాందిపలకడమే కాక... ఫలితాలను రాబట్టి, చైనాను ఒక శక్తిగా మలిచారు.

  • Loading...

More Telugu News