: ఐదు రూపాయలు చెల్లించండి.. గోవాలో మోడీ సభకు హాజరుకండి


కొత్త ఏడాదిలో జనవరి 12న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ గోవాలో జరగనుంది. ఈ సభకు హాజరయ్యే వారికి కమలదళం ఎంట్రీ ఫీజు నిర్ణయించింది. ఒక్కొక్కరూ రూ.5 చెల్లించి ఈ సభకు రావాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన మొత్తాన్ని ఉత్తరాఖండ్ రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇవ్వనుంది. ఈ మేరకు టిక్కెట్ల ముద్రణ, అమ్మకం జనవరిలోనే మొదలవుతుందని బీజేపీకి చెందిన ఓ నాయకుడు తెలిపారు. పార్టీ పీఎం అభ్యర్థిగా మోడీ పేరును ప్రకటించిన తర్వాత హైదరాబాదులో జరిగిన సభకు బీజేపీ తొలిసారిగా ఎంట్రీ ఫీజును వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. మోడీ సభకు దేశ వ్యాప్తంగా దాదాపు లక్షా 50వేల మంది వస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News