: జస్టిస్ గంగూలీ చుట్టూ బిగిసిన ఉచ్చు.. చర్యలు తీసుకోవాలంటున్న కాంగ్రెస్
ఓ న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే గంగూలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా, గంగూలీపై సరైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నట్లు ఆ పార్టీ ఎంపీ సందీప్ దీక్షిత్ తెలిపారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు గంగూలీపై చర్యలు తీసుకోవాలని నిన్న (బుధవారం) చెప్పారు. ఇప్పటికే గంగూలీపై తక్షణ చర్యలకు బీజేపీ, తృణమూల్ డిమాండ్ చేశాయి. అయితే, ఇప్పటికీ ఈ విషయంలో సదరు లా విద్యార్థిని మాత్రం ఎలాంటి కేసు పెట్టలేదు. కానీ, ఆరోపణలు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టు మాత్రం ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని వేసి గంగూలీని విచారించింది. దీన్ని నిరసిస్తూ గంగూలీ మాత్రం సుప్రీంకోర్టుకు ఓ లేఖ రాశారు. ఈ వ్యవహారంలో తన వాదన వినడంలేదని ఆయన వాపోయారు.