: కాంగ్రెస్ పార్టీవి దిగజారుడు రాజకీయాలు: తమ్మినేని


ఆనాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ లు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నారని... ఈ రోజు కేవలం జగన్ మాత్రమే సమైక్యం కోసం పోరాడుతున్నారని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం తెలిపారు. విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో వైకాపా చేపట్టిన గడప గడపకు సమైక్య నినాదం కార్యక్రమాన్ని తమ్మినేని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రం కోసం జగన్ తలపెట్టిన సమైక్య శంఖారావం కార్యక్రమానికి అందరూ మద్దతివ్వాలని కోరారు.

  • Loading...

More Telugu News