: హిట్లర్ కు పట్టిన గతే జగన్ కు పడుతుంది: యనమల
అత్యంత దురాశపరుడైన జగన్ ధనదాహానికి పలువురు అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు బలయ్యారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. త్వరలోనే హిట్లర్ కు పట్టిన గతే జగన్ కు పడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. యనమల ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ నాయకులకు వల విసురుతోందని సాక్షిలో కథనాలు వస్తున్నాయని... ఈ కథనాలు జగన్ వైఖరేంటో తెలియజేస్తున్నాయని విమర్శించారు. వైఎస్సార్సీపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను డబ్బులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.