: నాకింకా నోటీసులు అందలేదు: జేసీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపామన్న దిగ్విజయ్ సింగ్ మాటలపై ఆయన స్పందించారు. పార్టీ అధిష్ఠానం పంపిన నోటీసులు తనకింకా అందలేదన్నారు. కాబట్టి, వివరణ చెప్పుకోవాల్సిన అవసరంలేదన్నారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానన్నా... వద్దువద్దు వెళ్లి పొమ్మంటున్నారని చెప్పారు. తాను అవసరంలేదని కాంగ్రెస్ అనుకుంటోందన్నారు. కాగా, తాడిపత్రిలో కాంగ్రెస్ తరపున పోటీకి ఎవరూ లేకుంటే బొత్సనే పోటీ చేయాలన్నారు. జనవరి 23 తర్వాత ముఖ్యమంత్రి ఏం చెబుతారో తనకు తెలియదన్నారు.