: శంషాబాదులోని పామాయిల్ కంపెనీలపై గ్రామస్థుల దాడులు
హైదరాబాద్ శంషాబాద్ మండల పరిధిలోని గగన్ పహాడ్ లో ఈరోజు ఉదయం పామాయిల్ కంపెనీలపై పరిసర గ్రామాల ప్రజలు దాడికి దిగారు. పామాయిల్ కంపెనీల నుంచి వచ్చే కాలుష్యాన్ని తట్టుకోలేక.. ఆగ్రహంతో వారు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పామాయిల్ తయారీ సమయంలో ఘాటైన వాసనలు వస్తున్నాయని.. వాటిని భరించలేకపోతున్నామని గ్రామస్థులు వాపోయారు. ఈ విషయమై పలుమార్లు ఫిర్యాదు చేసినా కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.