: కమల్ తో నటించే అరుదైన అవకాశమంటున్న శేఖర్ కపూర్
నటుడు కమల్ హాసన్ తో కలిసి పనిచేసే అరుదైన అవకాశం కారణంగానే విశ్వరూపం-2 చిత్రంలోనూ నటించేందుకు అంగీకరించానని నటుడు శేఖర్ కపూర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇందులో ఆయన కల్నల్ జగన్నాథన్ పాత్ర పోషిస్తున్నారు. విశ్వరూపం మంచి విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా కమల్ హాసన్ తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను తీస్తున్నారు.