: నటుడు విజయకాంత్ ను దువ్వుతున్న కరుణానిధి
తమిళనాట తలపండిన డీఎంకే అధినేత కరుణానిధి నటనలో తలపండిన విజయకాంత్ ను దువ్వుతున్నారు. ఎందుకోసమంటే.. రానున్న లోక్ సభ ఎన్నికల కోసం. విజయకాంత్ కు చెందిన డీఎండీకేతో పొత్తు పెట్టుకుని వీలైనన్ని లోక్ సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా మరోసారి కేంద్రంలో చక్రం తిప్పాలన్నది కరుణ వ్యూహం. అందుకే లోక్ సభ ఎన్నికల కోసం డీఎండీకేతో కలిసి ఫ్రంట్ ఏర్పడితే సంతోషకరమని కరుణానిధి విలేకరులతో చెప్పారు. 2011లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎండీకే జయలలిత సారధ్యంలోని అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. కానీ, ఆ తర్వాత రెండు పార్టీల మధ్య విభేదాలు పొడచూపాయి.