: రెండో టెస్టు నేడే.. అమీతుమీకి భారత్, దక్షిణాఫ్రికా సిద్ధం


అనూహ్య మలుపులతో ఉత్కంఠను రేపిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు డ్రాగా ముగిసింది. చివరిదైన రెండో టెస్టు ఈరోజు డర్బన్ లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి వన్డే సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా... విజయంతో ఈ ఏడాదిని ముగించాలని సఫారీలు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి.

పిచ్ విషయానికి వస్తే... డర్బన్ పిచ్ పేసర్ల కంటే స్పిన్నర్లకే ఎక్కువ అనుకూలించే అవకాశం ఉంది. చివరి రెండు రోజులు బంతి అనూహ్యంగా టర్న్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే మన స్పిన్నర్ అశ్విన్ సఫారీ పిచ్ లపై ఇంత వరకు మెరుగైన ప్రదర్శన చేయకపోవడం భారత శిబిరాన్ని కలవరపరుస్తోంది. తొలి టెస్టు చివరి రోజున అశ్విన్ ఒక వికెట్ తీసినా ఫలితం భారత్ కు అనుకూలంగా ఉండేది. మరో విషయం ఏంటంటే... మ్యాచ్ ఆరంభంలో బ్యాట్స్ మెన్ కే అనుకూలంగా ఉంటుంది.

ఈ మ్యాచ్ కున్న మరో ప్రత్యేకత ఏంటంటే... క్రికెట్ లెజెండ్ కలిస్ కు ఈ టెస్టే ఆఖరిది. ఈ మ్యాచ్ అనంతరం కలిస్ టెస్టులకు గుడ్ బై చెబుతున్నాడు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. టెన్ స్పోర్ట్స్, టెన్ క్రికెట్ చానెళ్లలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది.

  • Loading...

More Telugu News