: పరిమితంగా వెన్నతింటే మంచిదేనట


వెన్నతింటే మంచిదికాదన్న భావన చాలా మందిలో వుంటుంది. అందుకే, మనసులో తినాలని ఉన్నా బరువు పెరుగుతామనే భయంతో వెన్నకు దూరంగా ఉంటారు. కానీ పరిమితంగా వెన్న తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం ఏమీ ఉండదని, పైగా మన గుండె ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వెన్నలో విటమిన్‌ ఎ, విటమిన్‌ డి, విటమిన్‌ ఇ, విటమిన్‌ కె2 చాలా ఎక్కువగా ఉంటాయట. వాటితోబాటు వెన్నలో బ్యుటిరేట్‌, కాంజుగేటెడ్‌ లినోలిన్‌ యాసిడ్‌ అనే పోషకాలు కూడా ఉంటాయి. బ్యుటిరేట్‌ అనే పోషకం అనేక మానసిక వ్యాధులను నివారిస్తుంది. మనకు అవసరమైన శక్తిని కూడా ఇస్తుంది. మనం తిన్న ఆహారం చిన్న పేగుల నుండి ఒంటికి పట్టేటప్పుడు అది ఏమాత్రం వృధాగా పోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది. చిన్న పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా తగ్గిస్తుంది. అలాగే కాంజుగేటెడ్‌ లినోలిక్‌ యాసిడ్‌ గుండె ఆరోగ్యానికి మంచిది. కాబట్టి నూనె, నెయ్యికంటే కూడా వెన్న తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే, పరిమితంగా తీసుకోవాలి. దీని వల్ల మన గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట.

  • Loading...

More Telugu News