: పిల్లల బరువు తగ్గించే కొత్తరకం తరగతి గది!


చిన్న పిల్లల్లో స్థూలకాయం వస్తే ఇక చిన్నప్పటినుండీ వారికి పలు రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకనే బాల్యంలో పిల్లల స్థూలకాయాన్ని తగ్గించాల్సిందిగా తల్లులకు నిపుణులు సూచనలిస్తుంటారు. ఇలా చిన్న పిల్లల్లో స్థూలకాయం సమస్యను అధిగమించడానికి, అలాగే వారిని టైప్‌-2 మధుమేహం నుండి దూరంగా ఉంచడానికి ఒక కొత్తరకం తరగతి గది సిద్ధమవుతోంది. చిన్న పిల్లలు అందునా పాఠశాలకు వెళ్లే పిల్లలు ఎక్కువ సమయం పాఠశాలలోనే గడుపుతుంటారు. దీనివల్ల వారిలో బోలెడన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతుంటాయి. వాటికి పరిష్కారంగా ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు కొత్తరకం తరగతి గదిని రూపొందించారు.

ఆస్ట్రేలియాకు చెందిన బకెర్‌ ఐడీఐ హార్ట్‌ అండ్‌ డయాబెటిస్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు చిన్నపిల్లల్లో స్థూలకాయం సమస్యను అధిగమించడానికి, వారిని టైప్‌-2 మధుమేహం సమస్యనుండి దూరంగా ఉంచడానికి ఒక సరికొత్త తరగతి గదిని రూపొందించారు. మోంట్‌ ఆల్‌బెర్ట్‌ ప్రాథమిక పాఠశాలలో పిల్లలు కూర్చోవడానికి, నుంచోవడానికి వీలుగా ఎత్తులను సరిచేసుకునే ఒక ప్రత్యేకమైన డెస్కులను ఏర్పాటు చేశారు. ఈ డెస్కులపై కూర్చుని పిల్లలు ఆస్వాదించడమే కాకుండా, నుంచుని కూడా పాఠాలను వినడానికి ఆసక్తి చూపుతున్నారట. ఇలాంటి కొత్తరకం తరగతి గదుల్లో పాఠాలను బోధించేందుకు ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నారట. నుంచుని, శరీరాన్ని కదిలిస్తూ ఉండడం వల్ల స్థూలకాయం ముప్పు తగ్గుతుందని, గుండెకు సంబంధించిన రక్తనాళాలు కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని పరిశోధకులు ప్రొఫెసర్‌ డేవిడ్‌ డన్‌స్టన్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News