: రోడ్డు ప్రమాదంలో రచయిత వెన్నెలకంటికి గాయాలు


రోడ్డు ప్రమాదంలో సినీ గేయ రచయిత వెన్నెలకంటి, ఆయన సతీమణి గాయపడ్డారు. వెన్నెలకంటి కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు నుంచి చైన్నైకు ఈ ఉదయం కారులో వెళుతున్నారు. ఆయన కారును వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెన్నెల కంటి స్వల్పంగా గాయపడగా, ఆయన భార్య ప్రమీల చేయి విరిగింది. తర్వాత వీరు చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వీరిరువురి పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. 

  • Loading...

More Telugu News