: తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ఏం ఒరగబెట్టింది: ఎర్రబెల్లి


టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రమంటూ పోరాడుతున్న టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు ఏం ఒరగబెట్టిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ తమలో బేషరతుగా విలీనం కావాలని కాంగ్రెస్ చూస్తోందన్న ఆయన, తెలంగాణ ప్రజలను మోసం చేయవద్దని కోరుతున్నానన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేస్తోందని, కాంగ్రెస్-టీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందాలను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో టీడీపీని లేకుండా చేయడం కేసీఆర్ తరంకాదన్న ఎర్రబెల్లి.. టీడీపీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల పార్టీ అని గుర్తించాలన్నారు. టీడీపీ ఎప్పుడూ ఊసరవెల్లి రాజకీయాలు చేయదని పేర్కొన్నారు. అంతేగాక విభజన ప్రక్రియలో కాంగ్రెస్-టీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News