: దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది: మంత్రి సి.రామచంద్రయ్య
దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. నియామకాలు, పదోన్నతులు హేతుబద్ధంగా లేనందునే దేవాలయాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మంత్రి అన్నారు. కాబట్టి, ప్రధాన ఆలయాల్లో పాలకమండలి స్థానంలో అధికారులతో కూడిన ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.