: రెండు గంటలుగా నిలిచిపోయిన తెనాలి - రేపల్లె ప్యాసింజర్
గుంటూరు జిల్లా వేమూరు మండలం పెనుమర్రు గ్రామ సమీపంలో తెనాలి - రేపల్లె ప్యాసింజర్ రైలు గేదెలను ఢీ కొనటంతో .. లెవల్ క్రాసింగ్ వద్ద ఆగిపోయింది. రెండు గంటలుగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి.. పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.