: ఎవరు గెలిచినా ఉద్యమం మాత్రం తీవ్రంగానే ఉంటుంది: అశోక్ బాబు
ప్రస్తుతం జరుగుతున్న ఏపీఎన్జీవో ఎన్నికల్లో ఎవరు గెలిచినా సమైక్య ఉద్యమం తీవ్ర స్థాయిలోనే ఉంటుందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలు నామమాత్రమేనని చెప్పారు. శ్రీకాకుళంలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా స్పందించారు. ఏపీఎన్జీవో ఎన్నికల ప్రభావం ఉద్యమంపై ఏమాత్రం ఉండదని చెప్పారు.