: గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాకం చిన్నారులను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. చర్మ సమస్యతో ఆసుపత్రికి వచ్చిన చిన్నారులను పరీక్షించిన వైద్యులు మందులను రాసిచ్చారు. అయితే ఆసుపత్రిలోని స్వీపర్ చికిత్స చేయడంతో పరిస్థితి విషమించింది. పూయాల్సిన లేపనాన్ని స్వీపర్ టానిక్ అనుకొని చిన్నారులిద్దరికీ తాగించింది. చిన్నారుల పరిస్థితి విషమించడంతో వారిని హుటాహుటిన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు.