: జగన్ ది ఫ్యాక్షన్ రక్తం.. సోనియాది మాఫియా రక్తం: యనమల
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోనియా, జగన్ లపై ఘాటైన విమర్శలు చేశారు. సమైక్య ముసుగు వేసుకున్న జగన్ రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారంటూ ఆరోపించారు. జగన్ ది ఫ్యాక్షన్ రక్తమైతే, సోనియాది మాఫియా రక్తమని విమర్శించారు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ద్వంద్వ నీతిని ప్రజలు గుర్తిస్తున్నారని... ఆయనకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. 2014 ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని యనమల జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జరిగిన భారీ అవినీతిలో దోచుకున్నది జగన్ అయితే, దోచిపెట్టింది వైయస్ రాజశేఖరరెడ్డి అని ఎద్దేవాచేశారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషిస్తాయని యనమల తెలిపారు.