: ఇకపై పెళ్లికాని అమ్మాయిలు ఆ ఊర్లో మొబైల్ వాడటం నిషేధం
ఇకపై పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడకూడదంటూ ఆ ఊరి పంచాయతీలో పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన బీహార్ చంపారన్ జిల్లాలోని సోంగర్ గ్రామంలో జరిగింది. ఒక వేళ పంచాయతీ నిర్ణయాన్ని ఏ అమ్మాయైనా ఉల్లంఘిస్తే... వారి కుటుంబాలకు భారీ ఎత్తున జరిమానా విధిస్తామంటూ హెచ్చరికలు జారీచేశారు. వందలాది మంది గ్రామస్తులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పంచాయతీ పెద్ద అన్సారీ తెలిపారు.
అయితే, పెళ్లికాని అమ్మాయిలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచే హక్కు పంచాయతీకి లేదని బీహార్ పంచాయతీరాజ్ మంత్రి భీమ్ సింగ్ తెలిపారు. ఆ గ్రామం నుంచి ఏ ఒక్క అమ్మాయైనా పంచాయతీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే... వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సదరు మంత్రి చెప్పారు.