: శాంతాక్లజ్ వేషధారణలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్
సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వినూత్న రీతిలో నిరసనలు కొనసాగిస్తున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయన శాంతాక్లజ్ అవతారమెత్తారు. చిత్తూరులో ఇవాళ క్రిస్మస్ తాత వేషధారణలో కనిపించి ప్రజలను ఆకట్టుకున్నారు. అంతేకాదు.. చిన్నారులకు క్రిస్మస్ బహుమతిగా సమైక్యాంధ్ర స్టిక్కర్లు అంటించిన చాక్లెట్లను శివప్రసాద్ పంచిపెట్టారు.