: ఏవోబీలో రెచ్చిపోయిన మావోలు... మందుపాతరలతో విధ్వంసం


గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఏవోబీలోని మల్కన్ గిరి జిల్లా పొడియా అటవీశాఖ బ్లాక్ ఆఫీస్ ను ఈ రోజు మందుపాతరలతో పేల్చివేశారు. ఈ ఉదంతంలో విలువైన రికార్డులు దగ్ధమైపోయాయి. శిలకోట ఎన్ కౌంటర్ కు నిరసనగానే ఈ విధ్వంసానికి మావోలు పాల్పడినట్టు అంచనా వేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మావోల కోసం కూంబింగ్ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News