: క్రెడిట్ కార్డు మాయాజాలం... అమెరికన్ ఎక్స్ ప్రెస్ సంస్థకు భారీ జరిమానా
మీరు అంతర్జాతీయ సంస్థల క్రెడిట్ కార్డు వినియోగదారులా?... అయితే మార్కెటింగ్ మాయాజాలం వలలో పడకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే, క్రెడిట్ కార్డు విక్రయాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంలో అమెరికన్ ఎక్స్ ప్రెస్ సంస్థతో పాటు మరో మూడు అనుబంధ సంస్థలకు భారీ జరిమానా పడింది. సుమారు 3 లక్షల 35 వేల మంది వినియోగదారులకు 368 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని ఆదేశిస్తూ, మరో వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ నియంత్రణ సంస్థ తీర్పునిచ్చింది.
ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అయిన అమెరికన్ ఎక్స్ ప్రెస్.. క్రెడిట్ కార్డు విభాగంతో పాటు, సెంచూరియన్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంక్ కంపెనీలు వినియోగదారులను మోసం చేశాయని తేలింది. క్రెడిట్ కార్డు బిల్లింగ్, యాడ్ ఆన్ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలొచ్చాయి. విచారణ జరిపిన అనంతరం.. కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో (సీఎఫ్ పీబీ) ద్వారా ఇప్పటి దాకా మోసపోయిన లక్షలాది మంది వినియోగదారులకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయించినట్లు సీఎఫ్ పీబీ డైరెక్టర్ రిచర్డ్ కార్డ్ రే వెల్లడించారు.