: ప్రమాణస్వీకారం రేపు ఉండకపోవచ్చు: కేజ్రీవాల్
ముందు అనుకున్న విధంగా రేపు (గురువారం) తన ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండకపోవచ్చని ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని కేజ్రీవాల్ చెప్పారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయాన్ని తెలియజేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి సమాచారం అందిన తర్వాత... తమ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్నాహజారేను ఆహ్వానిస్తామని చెప్పారు.
షరతుల్లేని మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేకపోయినా... వచ్చిన నష్టం లేదని తెలిపారు. ఒకవేళ తమ మద్దతును కాంగ్రెస్ పునరాలోచిస్తూ ఉంటే... అది వారి సమస్య అని కేజ్రీవాల్ అన్నారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి... ఇప్పటికే కార్యాచరణను మొదలు పెట్టామని ఏఏపీ అధినేత తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం 700 లీటర్ల పరిశుద్ధ నీటిని 24 గంటల్లోగా ఇస్తామని స్పష్టం చేశారు.