: ఘనంగా మాజీ ప్రధాని వాజ్ పేయి జన్మదిన వేడుకలు
మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయి ఈరోజు 89వ వత్సరంలోకి అడుగిడుతున్నారు. వాజ్ పేయి పుట్టిన రోజును పురస్కరించుకొని ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ ముఖ్య నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాదు, విజయవాడ పార్టీ కార్యాలయాల్లో నేతలు కార్యకర్తలకు స్వీట్లు పంచుతూ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో 1924, డిసెంబరు 25న జన్మించిన వాజ్ పేయి.. రాజనీతి శాస్త్రంలో ఎం.ఏ. పట్టా అందుకొన్నారు. తొలుత జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. సామాజిక కార్యకర్త స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి 1999-2004 సంవత్సరాల మధ్య దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు.