: మోడీజీ.. మహారాష్ట్ర గురించి వర్రీ వద్దు: ఉద్దవ్ ఠాక్రే
మహారాష్ట్ర గురించి ఆందోళన చెందవద్దని శివసేనాధిపతి ఉద్దవ్ ఠాక్రే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి సూచించారు. మోడీ ఇకపై గుజరాత్ నేతే కాదని.. ఆయన దేశ నాయకుడని ఉద్దవ్ తమ పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాశారు. ఇటీవల ముంబైలో జరిగిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. మహారాష్ట్ర కంటే అభివృద్ధిలో గుజరాత్ ముందున్న విషయాన్ని ప్రస్తావించారు. దీనికి ఉద్దవ్ సామ్నా సంపాదకీయంలో స్పందించారు. మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి చెందితే.. మహారాష్ట్ర అభివృద్ధి దశలో ఉందని తెలిపారు. కాషాయ జెండాను మోయడానికి మహారాష్ట్రలో శివసేన ఉందని పేర్కొన్నారు. మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు.