: నటుడు అలీ తమ్ముడికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు


ప్రముఖ సినీ హాస్య నటుడు అలీ తమ్ముడు ఖయ్యూంకు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. అతను ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని ఓ టిప్పర్ ఢీకొంది. ఈ ఘటన హైదరాబాద్ హయత్ నగర్ మండలం కోహెడ వద్ద నున్న ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. ఈ ప్రమాదంలో ఖయ్యూంకు తలపైన తీవ్రగాయాలయినట్టు ప్రాథమిక సమాచారం. తీవ్రంగా గాయపడిన ఖయ్యూంను మలక్ పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ఖయ్యూంతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ ప్రమాదంలో అతనికి కూడా గాయాలయ్యాయి. ఖయ్యూం ఇప్పటిదాకా ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించాడు.

  • Loading...

More Telugu News