: స్టెప్పులేసిన మంత్రులు ఏరాసు, కాసు
రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయిపూజిత వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చిందులేశారు. వైజాగ్ లోని నొవోటెల్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఏరాసు శాస్త్రీయ నృత్యంతో అలరించారు. అలాగే మరో మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కూడా స్టెప్పులేశారు. దీనికి తోడు, మంత్రి గంటా తన కుమార్తెతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు మోహన్ బాబు కూడా హాజరయ్యారు.