: ఇలా కూడా గిన్నిస్‌లోకి ఎక్కవచ్చు!
గిన్నిస్ బుక్‌లో పేరు నమోదు కావడానికి ఎన్ని మార్గాలున్నాయి... అంటే ఎవరూ సరిగ్గా చెప్పలేరేమో. కానీ వీడియో గేములను సేకరించి కూడా గిన్నిస్ రికార్డు కొట్టేశాడు. ఎన్ని వీడియో గేములు అంటే పదివేలకు పైగా గేములను సేకరించి అలా రికార్డుకెక్కేశాడు.
మైకేల్ థామ్సన్ అనే 31 ఏళ్ల వ్యక్తికి వీడియో గేములంటే పిచ్చి. ఈ పిచ్చి ఎంతగా అంటే లక్షకు పైగా సేకరించేంతగా. న్యూయార్క్‌కు చెందిన థామ్సన్ తన పన్నెండేళ్ల వయసునుండీ వివిధ రకాల వీడియో గేములను సేకరించడం ప్రారంభించాడు. ఇలా 31 ఏళ్ల వయసుకు వచ్చే సరికి థామ్సన్ వద్ద 10607 వీడియో గేములు పోగయ్యాయి. వీటితో అత్యధిక వీడియో గేములను సేకరించిన వ్యక్తిగా థామ్సన్ గిన్నిస్ బుక్‌లో రికార్డు తన పేరు రాసేసుకున్నాడు. అయితే ఒక్క వీడియో గేములే కాదు... థామ్సన్ వద్ద బోలెడన్ని ఆటపరికరాలు కూడా ఉన్నాయట. వీటి విలువ రూ.5 కోట్ల దాకా ఉంటుందని అంచనా!