: జనవరి ఒకటో తేదీన భక్తుల వసతి, ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష


సంవత్సరం ఆఖరి రోజు, సంవత్సరాది సందర్భంగా ప్రతి ఏటా భారీగా భక్తులు తిరుమలేశుని దర్శించుకొంటున్న విషయం విదితమే. నూతన సంవత్సరం సందర్భంగా, జనవరి ఒకటో తేదీన భక్తులకు వసతి, దర్శన ఏర్పాట్లపై తిరుమల ఈవో గోపాల్, జేఈవో శ్రీనివాస రాజు సమావేశమై సమీక్ష జరిపారు. కొత్త సంవత్సరం రోజున ఐదు వేల వీఐపీ టిక్కెట్లు మాత్రమే మంజూరు చేస్తామని.. ఒక్కో వీఐపీకి ఆరు టిక్కెట్లు మాత్రమే కేటాయిస్తామని జేఈవో చెప్పారు. అలాగే, కాలినడకన వచ్చే భక్తులకు ఆ రోజున 25 వేల మందిని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తామని ఆయన తెలిపారు. జనవరి ఒకటో తేదీన మొత్తం 60 వేల మంది భక్తులకు దర్శన ఏర్పాట్లు పూర్తి చేసామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News