: పోలవరం తరహా ప్రాజెక్టు తెలంగాణకు ప్రకటించాలి: కేసీఆర్
రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చిందని.. తెలంగాణ రాష్ట్రం రావడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణను సాధించి తీరుతామని.. కార్యకర్తల హర్షేతిరేకాల మధ్య కేసీఆర్ చెప్పారు. పోలవరం తరహా ప్రాజెక్టు ఒకటి తెలంగాణకు కావాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చే వరకూ కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. జనవరి 3వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద 25 వేల మంది కార్యకర్తలతో ధర్నా నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు.