: జనవరి 3 నుంచి విభజన బిల్లుపై చర్చ కొనసాగుతుంది: భట్టి విక్రమార్క
రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై శాసనసభలో జనవరి 3 నుంచి చర్చ కొనసాగుతుందని డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకు సభలో సభ్యులందరూ సహకరించాలని కోరారు. అసెంబ్లీలో చర్చించేందుకు తెలంగాణ బిల్లుకంటే ప్రధానమైన అంశం మరొకటి లేదని ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సభ్యులు తమ అభిప్రాయాలను చెప్పేందుకు శాసనసభే ప్రధాన వేదిక అని తెలిపారు.