: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. పంబకు వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయ్యప్పస్వామిని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తడంతో శబరిమలకు వెళ్లే దారులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కేరళతో పాటు ఆంధ్ర, తమిళనాడు నుంచి కూడా అయ్యప్ప మాలధారులు ప్రతి ఏటా భారీ సంఖ్యలో స్వామి దర్శనానికి వెళుతోన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పంబకు వెళ్లే రహదారిలో ఈరోజు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలప్ పూజ సమీపంలో సుమారు తొమ్మిది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.