: రెండొందల కోట్ల క్లబ్బులో 'ధూమ్ 3'


బాలీవుడ్ చిత్రం 'ధూమ్ 3' వసూళ్లలో దూసుకుపోతోంది. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు ఇండియాలో రూ.129.32 కోట్లు, ఓవర్ సీస్ ద్వారా రూ.73.17 కోట్లతో రూ.202.49 కోట్లు రాబట్టిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో తెలిపారు. దాంతో, ఈ ఏడాది రెండొందల కోట్ల క్లబ్బులో చేరిన నాలుగవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. అంతకుముందు 'చెన్నై ఎక్స్ ప్రెస్', 'క్రిష్ 3', 'రామ్ లీలా' రెండొందల కోట్ల మార్కును దాటాయి.

  • Loading...

More Telugu News