: దేశ ప్రజలకు రాష్ట్రపతి క్రిస్మస్ శుభాకాంక్షలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 'క్రిస్మస్ శుభసందర్భంగా నా తోటి పౌరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికీ మెర్రి క్రిస్మస్, కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నాను. పవిత్రమైన క్రిస్మస్ పండుగ రోజు ప్రతి ఒక్కరూ జీసస్ క్రైస్ట్ ప్రేమ, దయ బోధనలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి' అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.