: ఇటలీ రాయబారిపై వేటు?.. కఠిన చర్యల దిశగా కేంద్రం!
ఇద్దరు నావికాదళ గార్డులను భారత్ కు పంపడానికి నిరాకరించిన ఇటలీపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతోందని సమాచారం. కేరళ తీరంలో ఇద్దరు జాలర్లను కాల్చి చంపిన కేసులో నిందితులైన ఇద్దరు నావికాదళ గార్డులు ఎన్నికల కోసమని సుప్రీంకోర్టు అనుమతితో స్వదేశానికి తుర్రుమన్న సంగతి తెలిసిందే.
చట్ట ప్రకారం వారిని తిరిగి పంపాల్సిన బాధ్యత ఇటలీపై ఉంటుంది. కానీ, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున ఇటలీ రాయబారి డానియెల్ మాన్సిని బహిష్కరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయం వచ్చే వారంలో వెలువడుతుందని అంటున్నారు.

మరోవైపు ఇదే విషయమై బీజేపీ సభ్యులు పార్లమెంటు ఉభయ సభల్లో ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దౌత్య పోరాటం కోర్టు నిబంధనల ఉల్లంఘనగా పేర్కొన్నారు.