: ఏఏపీకి మద్దతుపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలున్నాయి: జనార్ధన్ ద్వివేది
బయటినుంచి కాంగ్రెస్ ఇస్తున్న మద్దతుతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. దానిపై కాంగ్రెస్ లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది ఢిల్లీలో మాట్లాడుతూ.. ఏఏపీకి మద్దతివ్వడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయన్నారు. అయితే, ప్రతిపక్షంలో కూర్చొని ప్రజా సమస్యలు లేవనెత్తాలని తమకు ప్రజలు తీర్పునిచ్చారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీయే పార్టీ భవిష్యత్ నేత అన్న ద్వివేదీ, పార్టీలో సోనియాగాంధీ తర్వాత స్థానం రాహుల్ దేనని చెప్పారు.