: ముగిసిన బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల సమావేశం
న్యూఢిల్లీలో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డు సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేత అద్వానీ, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. వచ్చే 2014 ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టోలో అంశాల పైన ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే ఎన్నికల్లో ఏఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలన్న దానిపైన కూడా సమాలోచనలు జరిపారు. సార్వత్రిక ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించే దిశగా కృషి చేయాలని పార్టీ పాలిత ముఖ్యమంత్రులకు రాజ్ నాథ్ సింగ్ సూచించారు.